నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
దేశంతో ఎక్కువ డిమాండ్ ఉన్నదాంట్లో బంగారం ఒకటి. అందువలన చాలా మంది దీన్ని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మనదేశంలో మహిళలు ఈ బంగారాన్ని
దిశ, వెబ్‌డెస్క్ :దేశంతో ఎక్కువ డిమాండ్ ఉన్నదాంట్లో బంగారం ఒకటి. అందువలన చాలా మంది దీన్ని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా మనదేశంలో మహిళలు ఈ బంగారాన్నికొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తికనబరుస్తుంటారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారం మాత్రమే. కాగా, గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి.నేడు బంగారం ధరలు బారీగా తగ్గాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గగా, గోల్డ్ ధర రూ.51,800గా ఉంది.అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.220 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,510గా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తూ నేడు భారీగా తగ్గాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధరపై రూ.500 తగ్గడంతో, రూ.71,500గా నమోదైంది.