శుభవార్త.. నేడు పడిపోయిన పసిడి, వెండి ధరలు

మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధర నేలకు వాలింది. సోమవారం కాస్త స్వల్పంగా తగ్గగా,ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.

Update: 2023-04-25 01:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధర నేలకు వాలింది. సోమవారం కాస్త స్వల్పంగా తగ్గగా,ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.

ప్రస్తుతం పెళ్లీల సీజన్ రాబోతుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాకుండా రైతన్నల పంట కూడా చేతికి రావడంతో వారు బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి క్రమంలో బంగారం రేట్ తగ్గుతుండటం వారందరికీ ఓ తీపి కబురు లాంటింది.

ఇక మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.70 తగ్గగా, గోల్డ్ రేట్ రూ. 55, 650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.80 తగ్గగా, గోల్డ్ రేట్ రూ. 60,710గా నమోదైంది. ఇక ఈరోజు వెండి ధరలు కూడా పసిడి మార్గంలోనే పయనించాయి. కేజీ వెండి ధరపై రూ. 400 తగ్గి రూ. 80, 000 గా ఉంది.

Also Read..

ఏప్రిల్ 25 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు 

Tags:    

Similar News