కార్డు లేకున్నా ATMలో డబ్బులు డ్రా చేయాలా.. ఇలా చేయండి!

ప్రస్తుతం అంతా డిజిటల్ ట్రెండే కొనసాగుతోంది. ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలంటే, బ్యాంకుకు వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూపీఐతోనే ఈజీగా నగదు చెల్లింపులు చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీ

Update: 2024-07-03 09:55 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అంతా డిజిటల్ ట్రెండే కొనసాగుతోంది. ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలంటే, బ్యాంకుకు వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూపీఐతోనే ఈజీగా నగదు చెల్లింపులు చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రజలు ప్రతి పనిని ఈజీగా చేసుకోవడానికి వీలు అవుతుంది. ఈ క్రమంలోనే బ్యాంకులకు వెళ్లే పని లేకుండా, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీ‌ఐలతో నగదులావాదేవీలను కూడా చాలా సులభంగా చేసుకుంటున్నారు.చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ వస్తువు కొనుగోలు చేసినా, నగదు రూపంలో కాకుండా ఫోన్ పే, యూపీఐ ద్వారా మనీ పే చేస్తున్నారు. అంతే కాకుండా దేని కోసమైనా డబ్బు అవసరం పడితే బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా ఏటీఎంల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుని వస్తున్నారు. దీంతో బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొచ్చుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అయితే మనం ఒక్కోసారి కార్డు మర్చిపోయి ఏటీఎం వద్దకు వెళ్లడం లేదా, అత్యవసరంగా మనకు డబ్బులు అవసరం పడితే, చేతిలో కార్డు లేకపోవడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. దీంతో కార్డు లేక, డబ్బులు డ్రా చేసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. అయితే ఇప్పుడు ఆ సమస్యకు కూడా చెక్ పడనుంది. కార్డు లేకున్నా ఏటీఎంలో ఈజీగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు అంట. ఇంతకీ అది ఎలా అని ఆలోచిస్తున్నారా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏటీఎంలలోకి వెళ్ళగానే ,అందులో కొత్తగా యూపీఐ ఫీచర్ కనిపిస్తుంది. దీంతో మీరు ఏటీఎం స్క్రీన్ పై యూపీఐ క్యాష్ లెస్ క్యాష్ అనే ఆప్షన్ కనిపించడంతో దానిని ప్రెస్ చేయాలి. తర్వాత మీకు ఎంత డబ్బు కావాలో అక్కడ నమోదు చేయాలి. అప్పుడు క్యూఆర్‌కోడ్ జనరేట్ అవుతుంది. దీంతో చెల్లింపు చేయడానికి యూపీఐ యాప్‌ను తెరిచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిలి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత మీకు నగదు ఏటీఎం నుంచి వస్తుంది. ఇలా మీ చేతిలో ఏటీఎం లేకపోయినా, ఈజీగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.


Similar News