ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులుకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ మీషో ఈ కామర్స్ సంస్థ.

Update: 2024-10-10 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులుకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రముఖ మీషో ఈ కామర్స్ సంస్థ. ఏకంగా 9 రోజుల వేతనంతో కూడిన సెలవులను ఉద్యోగులకు ఇస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ 9 రోజులు ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ఫోన్ కాల్స్, మెయిల్స్, ల్యాప్టాప్ వర్క్స్ ఉండవని తెలిపింది. కాగా వరుసగా 4వ ఏడాది కూడా 'రెస్ట్ అండ్ రీఛార్జ్' పేరుతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 3 వరకు తమ ఉద్యోగులకు బ్రేక్ ఇస్తున్నట్టు వెల్లడించింది. 'మా సంస్థ నుంచి మెగా బ్లాక్ బస్టర్ సెల్ తర్వాత, ఉద్యోగుల విశ్రాంతి మీద దృష్టి పెట్టాం. వారు ఈ 9 రోజులు సెలవు తీసుకొని, కొత్త శక్తితో తిరిగి పనులను మొదలు పెట్టబోతున్నారు' అంటూ మీషో చేసిన ప్రకటన చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  


Similar News