'కలర్ బ్యాంక్స్' టెక్నాలజీని ప్రారంభించిన టెక్నో పెయింట్స్!

ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

Update: 2023-08-28 14:59 GMT

హైదరాబాద్: ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో 'కలర్ బ్యాంక్స్' టెక్నాలజీ ప్రారంభించింది. దీని ద్వారా 3,000 కంటే ఎక్కువ రంగులను వినియోగదారులు నిమిషాల వ్యవధిలో పొందనున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో సైతం కలర్ బ్యాంక్స్‌ను ఆపరేట్ చేయగలిగేలా యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని ఫార్చూన్ గ్రూప్ వ్యవస్థాపకులు ఆకూరి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 5-6 కంపెనీలు మాత్రమే కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, తాము దీన్ని అందుబాటులోకి తీసుకురావడం కీలక మైలురాయిగా నిలుస్తుందని, దిగ్గజ కంపెనీల సరసన టెక్నో పెయింట్స్ చేరిందని కంపెనీ అభిప్రాయపడింది.

మొదటి 1,000 మంది డీలర్ల వద్ద ఈ కలర్ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేష్ బాబు ఉండటంతో మారుమూల పల్లెలకు కూడా కంపెనీ విస్తరణ వేగవంతమవుతుంది. ఈ ఏడాది ఆగష్టు 25 నాటికి కంపెనీ పాతికేళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలర్ బ్యాంక్స్ టెక్నాలజీ ప్రారంభించడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ, ఏపీ సహా నాలుగు దకషిణాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉండగా, 2024 నాటికి 250 ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు చేపడతామని ఆయన పేర్కొన్నారు.


Similar News