Stock Markets: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.

Update: 2024-10-16 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్(Global Market) లో ప్రతికూల సంకేతాలు, రెండో త్రైమాసిక సీజన్(Second Quarter Season)లో టాప్ కంపెనీలు అనుకున్నంతగా రాణించకపోవడం వంటివి మార్కెట్ల నష్టానికి కారణమయ్యాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా(Mahindra and Mahindra), ఇన్ఫోసిస్(Infosys) షేర్లలో అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,646.60 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 81,358.26 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 318.76 పాయింట్ల నష్టంతో 81,501.36 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 86.05 పాయింట్ల నష్టంతో 24,971.30 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.00గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

నష్టపోయిన షేర్లు : ఇన్ఫోసిస్, టైటాన్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, జేఎస్‍డబ్ల్యూ స్టీల్  


Similar News