Maruti Suzuki Swift: మారుతీ సుజికీ స్విఫ్ట్ నుంచి కొత్త ఎడిషన్.. ధర, మైలేజ్ ఎంతంటే..?
దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ స్విఫ్ట్(Maruti Suzuki Swift) లో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్(Blitz Edition)ను ఇండియా మార్కెట్(India Market)లోకి విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ స్విఫ్ట్(Maruti Suzuki Swift) లో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్(Blitz Edition)ను ఇండియా మార్కెట్(India Market)లోకి విడుదల చేసింది. ఎల్ఎక్స్ఐLXi, వీఎక్స్ఐ(VXi), వీఎక్స్ఐ(O) మూడు వేరియంట్ లలో ఈ కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 8.02 లక్షల(Ex-showroom)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ఎడిషన్ 3-సిలిండర్ ఇంజన్(3-Cylinder Engine)ను కలిగి ఉంది మైలేజ్(Mileage) విషయానికొస్తే..పెట్రోల్‌తో నడిచే స్విఫ్ట్ యొక్క మాన్యువల్ వెర్షన్ 24.8కిమీ/లీని ఇస్తుంది, ఆటోమేటిక్ వెర్షన్ 25.75కిమీ/లీని అందిస్తుంది. CNG వేరియంట్ 32.85km/kg ఇస్తుంది. ఇక వెనుక భాగంలో అండర్బాడీ స్పాయిలర్, ఫ్రంట్ లో ఫాగ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రియర్ అప్పర్ స్పాయిలర్, డోర్ వైజర్స్ సైడ్ బాడీ క్లాడింగ్‌ల వంటివి ఉన్నాయి. 9.0-అంగుళాల స్మార్ట్ ప్లేప్రో ప్లస్ టచ్‌స్క్రీన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX యాంకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్లతో సహా ఇతర ఫీచర్లతో ఈ కొత్త స్విఫ్ట్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.