TCS: ద్వితీయ త్రైమాసిక ఆదాయంపై ప్రెస్‌మీట్ రద్దు చేసిన టీసీఎస్
దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత, టాటా గ్రూప్స్ ఛైర్మన్(Tata Group Chairman) రతన్ టాటా(Ratan Tata) నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్:దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత, టాటా గ్రూప్స్ ఛైర్మన్(Tata Group Chairman) రతన్ టాటా(Ratan Tata) నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబై(Mumbai)లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి(Breach Candy Hospital)లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.ఈ రోజు సాయంత్రం వర్లీ(Worli) ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) తమ ద్వితీయ త్రైమాసిక(Q2FY25) ఆర్థిక ఫలితాలను వివరించేందుకు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్నిరద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం ఈ ప్రెస్‌మీట్ జరగాల్సి ఉండగా, అదే టైంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. బోర్డు మీటింగ్ అనంతరం తమ జులై-సెప్టెంబరు పద్దును స్టాక్ ఎక్స్ఛేంజీకి వివరిస్తామని పేర్కొన్నాయి. ఇక తొలి త్రైమాసికం(Q1FY25)లో టీసీఎస్ 9% వృద్ధిని నమోదు చేసింది.