పనితీరు బాగున్న ఉద్యోగులకు 12-15 శాతం జీతం పెంపు : TCS!

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్) మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతన పెంపు అందించినట్టు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు

Update: 2023-07-12 14:00 GMT

ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్) మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 12-15 శాతం వేతన పెంపు అందించినట్టు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. అలాగే, ప్రమోషన్లను కూడా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల్లో 55 శాతం మంది వారానికి మూడుసార్లు ఆఫీసుల నుంచి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం కంపెనీ అత్యుత్తమ ప్రతిభను పెంపొందించడం, నిలుపుకోవడం, రికార్డులను అందజేయడం, సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావడంపై దృష్టి సారించామని మిలింద్ లక్కడ్ వివరించారు. బుధవారం విడుదలైన జూన్ త్రైమాసిక ఫలితాలో టీసీఎస్ మెరుగైన లాభాలను నమోదు చేసింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 9,478 కోట్ల లాభాలను వెల్లడించగా, ఈసారి 17.83 శాతం పెరిగి రూ. 11,074 కోట్లు నమోదయ్యాయి. ఇక, ఆదాయం 12.55 శాతం పెరిగి రూ. 59,381 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ. 9 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించడానికి కంపెనీ బోర్డు నిర్ణయించింది.

Tags:    

Similar News