Tata vehicles: ట్రక్కులు, బస్సుల ధరలు పెంచిన టాటా మోటార్స్
కంపెనీకి చెందిన బస్సులు, ట్రక్కుల ధరలను జనవరి 1 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో ధరల పెంపు ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా, తాజాగా టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్టు ప్రకటించింది. కంపెనీకి చెందిన బస్సులు, ట్రక్కుల ధరలను జనవరి 1 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో పాటు, ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. ధరల పెంపు అన్ని రకాల ట్రక్కులు, బస్సుల మోడళ్లపై ప్రభాఇతం అవుతుందని, నిర్దిష్ట మోడల్, వేరియంట్‌ని బట్టి పెరుగుదలలో మార్పులు ఉంటాయని వివరించింది. కాగా, ఇప్పటికే సరఫరా వ్యయం, ఇతర ఖర్చుల ఆధారంగా మారుతీ సుజుకి, హ్యూండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ విభాగం సహా లగ్జరీ బ్రాండ్లు మెర్సిడ్స్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి ఇండియా ధరల పెంపును ప్రకటించాయి. అన్ని కంపెనీలు జనవరి 1 నుంచే పెంపు నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి.