TRAI: కోటి మంది యూజర్లను కోల్పోయిన మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు

బీఎస్ఎన్ఎల్ దాదాపు 8.5 లక్షల మంది యూజర్లను చేర్చుకుంది.

Update: 2024-11-21 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడంతో ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అది కలిసొచ్చింది. దీనివల్ల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు వరుస నెలల్లో యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం కొత్త కస్టమర్లను సాధిస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలలోనూ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు సంయుక్తంగా కోటి మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకున్నాయి. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ దాదాపు 8.5 లక్షల మంది యూజర్లను చేర్చుకుంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డేటా ప్రకారం.. సమీక్షించిన నెలలో జియో అత్యధికంగా 79.69 లక్షల మందిని పోగొట్టుకోగా, 14.34 లక్షల మందిని, వొడాఫోన్ 15.53 లక్షల మందిని కోల్పోయాయి. సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ 46.37 కోట్లకు చేరగా, ఎయిర్‌టెల్ 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా 21.24 కోట్లుగా ఉంది. కాగా, ఈ ఏడాది జూలైలో మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు 10-27 శాతం టారిఫ్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News