Trump Gold Policy: ట్రంప్‌ తీసుకునే ఈ ఒక్క నిర్ణయంతో బంగారం ధరలు అమాంతం తగ్గిపోతాయా?

Trump Gold Policy: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి పరిస్థితులు గందరగోళంగా మారాయి.

Update: 2025-03-27 06:33 GMT
Trump Gold Policy: ట్రంప్‌ తీసుకునే ఈ ఒక్క నిర్ణయంతో బంగారం ధరలు అమాంతం తగ్గిపోతాయా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Trump Gold Policy: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి పరిస్థితులు గందరగోళంగా మారాయి. అనుకూల, ప్రతికూల నిర్ణయాలతో ట్రంప్ ప్రపంచదేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. తాజాగా అమెరికా బంగారం ఆటను ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉన్నదేశం ఇప్పుడు డిజిటల్ బంగారాన్ని అంటే బిట్కాయిన్ ను కొనుగోలు చేయడానికి రెడీ అవుతోంది. బిట్ కాయిన్ కొనుగోలు చేసేందుకు అమెరికా తన వద్ద బంగారాన్ని విక్రయించవచ్చని ట్రంప్ పరిపాలన సూచించింది. ఇది ప్రపంచంలో బిట్ కాయిన్ సూపర్ పవర్ గా మారే దిశగా అమెరికా ముందుకు తీసుకెళ్తుంది. అందుకే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

వైట్ హౌస్ డిజిటల్ అసెట్స్ కౌన్సిల్ యాక్టింగ్ డైరెక్టర్ బో హైన్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యనిర్వహాక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు తెలిపారు. దీనికింద అమెరికా ఇప్పుడు స్ట్రాటజిక్ బిట్ కాయిన్ రిజర్వ్ ను స్రుష్టించాలని యోచిస్తోంది. బిట్ కాయిన్ చట్టం 2025 ప్రకారం సెనేటర్ సింథియా లూమిస్ పార్లమెంట్ లో 2025 బిట్ కాయిన్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది రానున్న 5ఏళ్లలో 1 మిలియన్ బిట్ కాయిన్స్ ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బిట్ కాయిన్ లో దాదాపు 5శాతం ఉంటుంది. బంగారం విలువను పెంచడం వల్ల దీనికోసం 700 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే అమెరికా బిట్ కాయిన్ ఎలా కొనుగోలు చేస్తుందన్న ప్రశ్నకు ప్రభుత్వం మూడు మార్గాలను సూచించింది. పార్లమెంటు ఆమోదంతో నేరుగా బిట్ కాయిన్ కొనుగోలు చేయడం, బంగారాన్ని బిట్ కాయిన్ లేదా బిట్ కాయిన్ లింక్డ్ సాధానాలుగా మార్చడానికి స్థిరీకరణ నిధులను మార్పిడి చేయడం , బంగారు ధ్రువపత్రాల పున గణన అంటే ప్రభుత్వం బంగారం ధరను ఔన్సుకు 42 డాలర్ల నుంచి 3,000డాలర్లకు పెంచడం ద్వారా 700బిలియన్ డాలర్లను సేకరిస్తుంది.

అమెరికాలో 8,133 టన్నుల బంగారం ఉండగా దీని విలువ ఇప్పుడు 860బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ బంగారంలో కొంత భాగాన్ని విక్రయించి డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మరింత లాభదాయకంగా ఉంటుందని ట్రంప్ పరిపాలన విశ్వసిస్తోంది. ఇది అమెరికా ప్రపంచ క్రిప్టో నాయకత్వాన్ని పొందేందుకు క్రిప్టో రంగంలో చైనాతో పోటీ పడేందుకు వీలు కల్పిస్తుంది.మొత్తానికి ఈ చర్య అమెరికాను సాంప్రదాయ బంగారం వ్యూహం నుంచి దూరంగా డిజిటల్ రంగంలోకి తీసుకెళ్తుంది. కానీ ఇది ప్రమాదాలను కూడా పెంచుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. 

Tags:    

Similar News