8-10 శాతం ఉద్యోగుల తొలగింపు యోచనలో Swiggy!

దేశవ్యాప్తంగా కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి.

Update: 2023-01-19 09:16 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా మరోసారి తొలగింపుల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిధుల సేకరణ కష్టమైన నేపథ్యంలో ఖర్చులను తగ్గించేందుకు తన మొత్తం ఉద్యోగుల్లో 8-10 శాతం మందిని ఇంటికి పంపే అంశాన్ని పరిశీలిస్తోందని గురువారం ఓ నివేదిక తెలిపింది. తాజా నిర్ణయంతో స్విగ్గీలోని ప్రోడక్ట్, ఇంజనీరింగ్, కార్యకలాపాల విభాగాల్లోని ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉండనుంది.

గత కొంతకాలంగా ఐపీఓకు వచ్చిన టెక్ ఆధారిత కంపెనీలు బలహీనమైన పనితీరుతో స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్నాయి. ఈ క్రమంలో స్విగ్గీ ఐపీఓకు రావడానికి మరికొంత సమయం తీసుకుంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టే సమయంలో వీలైనంత లాభదాయకంగా ఉండాలనే లక్ష్యంలో భాగంగా తొలగింపులకు మొగ్గు చూపుతున్నట్టు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీంతో పాటు పెరుగుతున్న గ్లోబల్ అనిశ్చితులు, మాంద్యం భయాల మధ్య భారత స్టార్టప్‌లు కొత్త నిధుల కోసం చూస్తున్నాయి. స్విగ్గీ ఇప్పటికే తన మార్కెట్ వాటాను క్రమంగా కోల్పోతోంది. ఈ సమయంలో తగిన నిర్ణయాలతో పనితీరును మెరుగుపరుచుకోవాలని భావిస్తోందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది.

Tags:    

Similar News