Swiggy: $15 బిలియన్ల మార్కెట్ విలువను లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గీ

సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ తన రాబోయే ఐపీఓ

Update: 2024-08-23 13:27 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ తన రాబోయే ఐపీఓద్వారా $1-1.2 బిలియన్లను(దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా ) సమీకరించి సుమారు $15 బిలియన్ల మార్కెట్ విలువను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాల వారు తెలిపారు. కంపెనీ ఇప్పటికే $1.25 బిలియన్ల నిధులను సమీకరించే ఐపీఓ కోసం ఏప్రిల్‌లో వాటాదారుల నుంచి ఆమోదాన్ని పొందింది. మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఐపీఓకు రావడానికి దరఖాస్తు చేసుకోగా, దీనికి త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉంది.

స్విగ్గీ మరో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ Zomatoతో పోటీపడుతోంది. 10 నిమిషాల్లో డెలివరీ చేయబడే కొత్త క్విక్ కామర్స్ సేవలపై రెండు కంపెనీలు కూడా పోటా పోటీగా పనిచేస్తున్నాయి. స్విగ్గీ తన ప్రత్యర్థి కంటే మరింత పైచేయి సాధించడానికి ఈ ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను కార్యకలాపాలను మరింత పెంచడానికి ఉపయోగించాలని చూస్తుంది. స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకంగా ఉంది, అయితే కిరాణా డెలివరీ ఇన్‌స్టామార్ట్ వ్యాపారం ఇప్పటికీ నష్టాల్లో ఉంది. కంపెనీ 35 భారతీయ నగరాల్లో దాదాపు 550 కిరాణా షాపుల ద్వారా వ్యాపారం చేస్తుంది. ఇటీవల US-ఆధారిత ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో స్విగ్గీ మార్కెట్ విలువను 12.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.


Similar News