Swiggy IPO: నవంబర్ 6 నుంచి స్విగ్గీ ఐపీఓ.. సబ్‌స్క్రిప్షన్‌ తేదీ, షేర్ ధరల వివరాలివే..!

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-10-28 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) నవంబర్ 6న ప్రారంభమై 8 వరకు కొనసాగనుందని తెలిపింది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) నవంబర్ 5న విండో తెరుచుకోనుందని పేర్కొంది. కాగా ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 11,300 కోట్లను ఆ సంస్థ సమీకరించనుంది. దీంతో ఎల్ఐసీ(LIC), హ్యుండాయ్(Hyundai) తర్వాత స్విగ్గీదే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 371- రూ. 390గా కంపెనీ ఖరారు చేసింది. ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 4500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 6800 కోట్లను సమీకరించనున్నారు. కాగా స్విగ్గీలో ఇన్వెస్ట్ మెంట్ సంస్థ అయిన ప్రోసస్(Prosus) కు 31శాతం షేర్ల వాటా ఉంది. అలాగే సాఫ్ట్ బ్యాంక్(Soft Bank)కు కూడా స్విగ్గీలో షేర్ల వాటాలున్నాయి. కాగా బెంగుళూరుకు చెందిన స్విగ్గీని 2014లో స్థాపించారు. ఈ ఇయర్ రాబోతున్న అతిపెద్ద ఐపీఓల్లో స్విగ్గీ కూడా ఒకటి కావడం విశేషం.


Similar News