FD Rates: ఎఫ్‌డీ రేట్లను సవరించిన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఇది వర్తిస్తుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది

Update: 2024-09-25 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఇది వర్తిస్తుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం.. సాధారణ ఖాతాదారులకు 4 శాతం నుంచి గరిష్టంగా 8.60 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం మధ్య రాబడిని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులకు వర్తించనుంది. 6 నెలల ఒక రోజు కాలవ్యవధిపై డిపాజిట్లకు 7.25 శాతం, ఏడాది కాలవ్యవధిపై 6.85 శాతం, 2 ఏళ్ల డిపాజిట్లపై అత్యధికంగా 8.65 శాతం, 3 ఏళ్ల కాలానికి 8.60 శాతం, 5 ఏళ్ల కాలవ్యవధిపై 8.25 శాతం, 5-10 ఏళ్ల కాలానికి 7.25 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు పేర్కొంది. 

Tags:    

Similar News