ఈజీగా నెలకు లక్షరూపాయలు సంపాదించాలా.. మీ కోసమే బెస్ట్ బిజినెస్ ఐడియా?

ప్రస్తుతం చాలా మంది యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది. రోజూ నెల నెల జీతం సంపాదించడం, ఒకరి వద్ద ఎంప్లాయిగా పని చేయడం ఇంట్రెస్ట్ ఉండక, మరి కొందరు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనే ఆశతో బిజినెస్ వైపు

Update: 2024-05-21 09:21 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది. రోజూ నెల నెల జీతం సంపాదించడం, ఒకరి వద్ద ఎంప్లాయిగా పని చేయడం ఇంట్రెస్ట్ ఉండక, మరి కొందరు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనే ఆశతో బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అదిరిపోయే సూపర్ బిజినెస్ ఐడియా. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసే వాటిలో కోడి గుడ్లు ఒకటి. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా ఈ బిజినెస్‌ను మనం ఎక్కడి నుంచి అయినా చేయోచ్చు. అందువలన తక్కువ పెట్టు బడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ బిజినెస్ చాలా బెటర్ అంటున్నారు నిపుణులు.

బిజినెస్ ఎలా?

ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే ముందుగా మీరు స్థానికంగా ఉన్న పౌల్ట్రీ సంస్థల నుంచి డీలర్‌షిప్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్,ఇంకా జీఎస్టీ నెంబర్ పొందాలి. ఇవన్నీ వచ్చిన అనంతరం మీరు కోడిగుడ్ల సప్లయ్‌ని ప్రారంభించవచ్చు. మీరు కాస్త తక్కువ ధరకు, డిస్కౌంట్ మీద ఎగ్స్ కొనుగోలు చేస్తుంటారు.  అయితే మీరు సప్లై చేసేటప్పుడు మార్కెట్ ధరకు అమ్మాలి. షాప్స్, కూరగాయల దుకాణం, కిరాణం షాపుల్లో ఇలా చాలా వాటిల్లో మీరు మీ ఎగ్స్ సప్లై చేస్తూ ఉండాలి. దీని ద్వారా మీరు మంచి ఆదాయం పొందుతారు. దీని ద్వారా మీ ఖర్చులు పోను దాదాపు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు అంటున్నారు నిపుణుు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆలోచించండి ఈ బిజినెస్ ఐడియా గురించి.


Similar News