‘సోనీకి మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనున్న భారత్’

దిగ్గజ కంపెనీ సోనీకి రాబోయే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ చెప్పారు.

Update: 2024-06-30 09:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ కంపెనీ సోనీకి రాబోయే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ చెప్పారు. ఈ కాలంలో భారతదేశంలో సోనీ వ్యాపారం రూ.10,000 కోట్లకు చేరుకోనుందని, తన సొంత దేశమైన జపాన్‌ మార్కెట్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా సోనీకి భారత్ ముఖ్యమైన వ్యాపార దేశంగా మారుతుందని ఆయన అంచనా వేశారు.

ప్రస్తుతం, అమెరికా, చైనా, జపాన్ ప్రపంచవ్యాప్తంగా సోనీకి మొదటి మూడు మార్కెట్‌లుగా ఉన్నాయి, భారతదేశం తరువాతి స్థానంలో ఉంది. అయితే త్వరలో జపాన్ స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందని నయ్యర్ చెప్పారు. దేశంలో 2022-23లో కంపెనీ రూ. 6,353 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ప్రస్తుతం వృద్ధిని నడపడానికి ఆడియో, ఇమేజింగ్ ఉత్పత్తులతో పాటు ప్రీమియం టెలివిజన్ సెగ్మెంట్‌పై ఎక్కువ అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయిని ఆయన అన్నారు. భారతదేశ ఆర్థిక రంగం వృద్ధి కూడా సోనీకి మంచి మార్కెట్‌గా నిలవడానికి కారణం అయిందని నయ్యర్ చెప్పారు.

కరోనా తర్వాత సోనీ ప్రీమియం ఉత్పత్తుల కోసం భారతదేశం పెద్ద ఆర్థిక దేశంగా అభివృద్ధి చెందడం బాగా ఉపయోగపడింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో వ్యాపారం బాగా పెరుగుతుంది. నాణ్యమైన ఉత్పత్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి దేశంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సోనీ ఉత్పత్తులు నమ్మకానికి మారుపేరుగా ఉంటాయి. అందుకే కంపెనీకి భారత్ ముఖ్యమైన మార్కెట్ అని నయ్యర్ అన్నారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడిన ఆయన, సౌండ్‌బార్‌లు, పార్టీ స్పీకర్‌లు, నిజమైన వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, టీవీ, గేమింగ్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త సాంకేతికతతో నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొస్తామని చెప్పారు.

Similar News