ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్.. ఈజీగా లక్షపొందండి ఇలా
ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి
దిశ, వెబ్‌డెస్క్ : ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెడితే అవి ఉన్నత చదువుల కోసం ఉపయోగపడుతాయి.అందువలన ఉమెన్స్ డే సందర్భంగా ఈ పథకం గురించి తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన పథకం అర్హతలు :
ఈ పథకాన్ని ఓపెన్ చెయ్యాలంటే భారత పౌరురాలు అయి ఉండాలి
అకౌంట్‌ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయసు పదేళ్లకు మించి ఉండరాదు.
సుకన్య సమృద్ధి యోజన ఖాథఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రమే తెరుస్తారు.
బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు.
ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు.
పథకం ముఖ్యమైన వివరాలు :
సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఒక వేళ మీరు పది సంవత్సరాల కాలానికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. 100000 అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.
Also Read..
ఉమెన్స్ డే రోజు మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు