Stock Markets: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గత కొన్ని రోజుల నుంచి నష్టాల్లో కొనసాగుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి.
దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజుల నుంచి నష్టాల్లో కొనసాగుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో 5 సెషన్ల వరుస నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం నుంచి ఫ్లాట్(Flat)గా ట్రేడవుతూ వచ్చిన సూచీలు ఆసియా మార్కెట్(Asia Market)లో సానుకూల సంకేతాలు రావడం, ఇన్వెస్టర్ల(Investors) కొనుగోళ్లు మద్దతుతో సూచీలు బలంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,653 పాయింట్ల వద్ద ఉత్సాహంగా మొదలయ్యింది. ఇంట్రాడేలో 80,539.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 602.75 పాయింట్ల లాభంతో 80,005.04 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 158 పాయింట్ల లాభంతో 24,339 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్
నష్టపోయిన షేర్లు : కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్