Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 25,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి.

Update: 2024-10-22 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు గ్లోబల్ మార్కెట్ల(Global Market) నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ రావడంతో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,155.08 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 80,149.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 930.55 పాయింట్లు నష్టపోయి 80,220.72 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 309 పాయింట్ల నష్టంతో 24,472 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్

నష్టపోయిన షేర్లు : అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ , టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్


Tags:    

Similar News