Stock Market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(మంగళవారం) లాభాలోతో ముగిశాయి.

Update: 2024-12-03 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(మంగళవారం) లాభాలోతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో మన బెంచ్ మార్క్ సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80, 529.20 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,949.10 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 181 పాయింట్లు పెరిగి 24,457.15 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.69కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్

నష్టాల్లో ముగిసిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ

Tags:    

Similar News