Stock Market: యూఎస్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) భారీ లాభాల్లో ముగిశాయి.
దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం దాదాపుగా ఖరారు కావడంతో గ్లోబల్ మార్కెట్ల(Global Markets)తో పాటు మన బెంచ్ మార్క్ సూచీలు రాణించాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ లో మదుపర్ల సంపద ఏకంగా రూ. 8 లక్షల కోట్లు పెరిగి మొత్తంగా రూ. 452 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా ఈ రోజు ఐటీ స్టాక్స్(IT Stocks) కొనుగోళ్లులో జోరు కనిపించడంతో ఇన్ఫోసిస్(Infosys), టీసీఎస్(TCS), రిలయన్స్(Reliance) షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,771.82 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై మార్కెట్ ముగిసే వరకు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 80,569.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 901.50 పాయింట్ల లాభంతో 80,378.13 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 270 పాయింట్లు పెరిగి 24,484 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.44 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.30 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, అదానీ పోర్ట్స్
నష్టపోయిన షేర్లు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనీలీవర్