Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం భారీ నష్టాలలో ముగిశాయి.

Update: 2024-11-07 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం భారీ నష్టాలలో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించడంతో నిన్న లాభాల్లో ముగిసిన మన బెంచ్ మార్క్ సూచీలు నేడు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నేడు వడ్డీ రేట్లను ప్రకటించడం, రూపాయి విలువ పడిపోవడం స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు ఐసీఐసీఐ, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80,563.42 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై కాసేపటికే నష్టాల్లోకి వెళ్ళింది. ఇంట్రాడేలో 79,419.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 836.50 పాయింట్ల నష్టంతో 79,541.79 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 284 పాయింట్లు తగ్గి 24,199 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.37 దగ్గర ముగిసింది.

లాభాలో ముగిసిన షేర్లు : అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎల్, ఎల్ అండ్ టీ

నష్టపోయిన షేర్లు : హిందాల్కో ఇండస్ట్రీస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్

Tags:    

Similar News