Stock Market: రాణించిన బ్యాంకింగ్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళావారం లాభాల్లో ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) మంగళావారం లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్(Global Market) నుంచి నెగటివ్ సిగ్నల్స్(Negative Signals) రావడంతో ఈ రోజు ఉదయం ఫ్లాట్(Flat)గా ట్రేడవుతూ వచ్చిన సూచీలు తర్వాత నష్టాల బాట పట్టాయి. అనంతరం బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్ల అండతో సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ(ICICI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్( HDFC Bank) షేర్లు రాణించాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 80,037 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా మొదలయ్యింది. ఇంట్రాడేలో 80,450 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 363 పాయింట్ల లాభంతో 80,369 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 127 పాయింట్ల లాభంతో 24,466 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
నష్టపోయిన షేర్లు : టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్