Stock Market: ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్ల అండ.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(శుక్రవారం) భారీ లాభాల్లో ముగిశాయి.

Update: 2024-11-29 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(శుక్రవారం) భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో నిన్న ఘోర పతనాన్ని చవిచూసిన మన మార్కెట్లు నేడు కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 79,032.99 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమై తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వెళ్ళింది. ఇంట్రాడేలో 79,923 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 759.05 పాయింట్ల లాభంతో 80,234.06 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ(Nifty) 216 పాయింట్లు పెరిగి 24,131.10 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.62 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.49కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్

నష్టాల్లో ముగిసిన షేర్లు : నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ 

Tags:    

Similar News