త్వరలో సిమ్, ఇంటర్నెట్ లేకుండా వీడియోలు, టీవీ ప్రసారాలు

25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ని డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌ మరింత వేగవంతంగా పనిచేస్తుందని,

Update: 2024-01-16 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ లేకుండా వీడియోలను, టీవీ కార్యక్రమాలను చూడనున్నారు. దీన్ని నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. మంగళవారం జరిగిన బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీని ప్రస్తుతం 19 నగరాల్లో పరీక్షిస్తున్నామని, 470-582 ఎమ్‌హెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ని డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌ మరింత వేగవంతంగా పనిచేస్తుందని, దేశీయ డిజిటలీకరణను వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని పెంచుతుందని అపూర్వ చంద్ర వివరించారు. గతేడాది డైరెక్ట్-టూ-మొబైల్‌ను బెంగళూరు, ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు. డైరెక్ట్-టూ-మొబైల్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా దాదాపు 8-9 కోట్ల మందికి టెక్నాలజీ చేరువ కానుందని చంద్ర వెల్లడించారు. కాగా, డీటీహెచ్ తరహాలో పనిచేసే ఈ డైరెక్ట్-టూ-మొబైల్ టెక్నాలజీని బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌కాస్ట్ కలిపి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. 

Tags:    

Similar News