Soaps Prices Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల ధరల పెంపు..!
సామాన్యులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు వస్తువుల ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వార్త షాకింగ్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో సబ్బుల(Soaps) ధరలను పెంచుతూ పలు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL), విప్రో(Wipro), గోద్రెజ్(Godrej) లాంటి దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు(FMCG companies) సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను 7 నుంచి 8 శాతం పెంచాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడి సరుకైన పామ్ ఆయిల్(Palm oil) ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి 35-40 శాతం పెరిగాయి. దీంతో సబ్బుల రేట్లను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అలాగే స్నానపు సబ్బులతో పాటు స్కిన్ క్లీనింగ్ క్రీమ్(Skin cleansing cream)ల రేట్లను కూడా కంపెనీలు పెంచాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ఇటీవల ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కాఫీ(coffee), టీ పౌడర్(Tea Powder) ధరలను 25 శాతం పెంచిన విషయం తెలిసిందే.