అమెజాన్‌లో పెరగనున్న ఉత్పత్తుల ధరలు!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇకపై ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. కొన్ని విభాగాలకు చెందిన వస్తువులకు సెల్లర్ ఫీజును పెంచాలని అమెజాన్ ఇండియా నిర్ణయించడమే దీనికి కారణం.
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇకపై ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. కొన్ని విభాగాలకు చెందిన వస్తువులకు సెల్లర్ ఫీజును పెంచాలని అమెజాన్ ఇండియా నిర్ణయించడమే దీనికి కారణం. దుస్తులు, కిరాణా, ఔషధాలు, బ్యూటీ సహా పలు రకాల వస్తువులపై విధిస్తున్న సెల్లర్ ఫీజును అమెజాన్ సవరించింది. ఇది ఈ నెలాఖరు నుంచి అమలు కానుండగా, దానివల్ల వినియోగదారులపై కొంతమేర భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అమెజాన్‌లో ఉత్పత్తులను విక్రయించినందుకు గానూ విక్రయదారూ నుంచి అమెజాన్ సంస్థ కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఇది ఉత్పత్తుల విభాగాన్ని బట్టి మారుతుంది. దాని ప్రకారం, కొత్త ధరలు అమలైతే ప్రస్తుతం రూ. 300లోపు బ్యూటీ, షవర్ ఉత్పత్తులు, హెయిర్‌కేర్ వంటి వాటిపై ఉన్న 7 శాతం ఫీజు 8.5 శాతానికి చేరుకుంటుంది. రూ. 1,000 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై సెల్లర్ ఫీజు 19 శాతం నుంచి 22.5 శాతానికి పెరుగుతునంది.
ఇదే సమయంలో మసాలా దినుసులు వంటి వాటిపై ఫీజును తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఆందోళనలు ఉన్న కారణంగా అమెజాన్‌తో పాటు టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులతో పాటు ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే సెల్లర్ ఫీజును అమెజాన్ సవరించింది. ప్రస్తుత మార్కెట్, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీల్లో మార్పులు చేసింది.
Read more: