Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో.Stock Market - Latest Telugu News
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావంతో సూచీల ర్యాలీ నెమ్మదించింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటం వారాంతం స్టాక్ మార్కెట్లు(Stock Market) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అమెరికా మార్కెట్ 2020 తర్వాత అత్యధిక సింగిల్ డే నష్టాన్ని చూసింది. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉండొచ్చని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నగదు నిల్వ నిష్పత్తిని కూడా ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో సుమారు రూ. 80 వేల కోట్ల నగదును చలామణి ఉపసంహరించుకోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు.
మరోవైపు ద్రవ్యోల్బణం అత్యధికంగా కొనసాగుతుండటంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనాల కోసం చూస్తున్నారు. బాండ్లలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 866.65 పాయింట్లు పతనమై 54,835 వద్ద, నిఫ్టీ 271.40 పాయింట్లు కుదేలై 16,411 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు 2 శాతానికి పైగా బలహీనపడ్డాయి. రియల్టీ ఏకంగా 3.50 శాతానికి పైగా నీరసించింది.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎస్‌బీఐ లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, నెస్లె, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ కంపెనీల షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ రూ. 76.87 వద్ద ఉంది.