Stock Market: 79 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్

ఉదయం నుంచి భారీ లాభాల్లోనే ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత ఒక్కసారిగా నీరసించాయి.

Update: 2024-08-13 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు సెషన్‌లో స్వల్పంగా బలహీనపడిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అధిక నష్టాలను చూశాయి. అయితే, ఉదయం నుంచి భారీ లాభాల్లోనే ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత ఒక్కసారిగా నీరసించాయి. కీలక బ్లూచిప్ స్టాక్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగాల్లో అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలతో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 692.89 పాయింట్లు పతనమై 78,956 వద్ద, నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో 24,139 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ మినహా దాదాపు అన్ని రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది. 

Tags:    

Similar News