స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీలు చివరి వరకు అదే
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ పరిణామాలు మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లలో లాభాలు ఊపందుకోవడం మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ అదానీ కంపెనీల షేర్లలో వాటాను పెంచుకోవడం అందుకు కలిసొచ్చింది.
ఇదే సమయంలో రోజంతా మెరుగైన లాభాలతో దూసుకెళ్లిన సూచీలకు చివర్లో కీలక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కలిగించడం వల్ల లాభాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 18.11 పాయింట్లు లాభపడి 61,981 వద్ద, నిఫ్టీ 33.60 పాయింట్లు పెరిగి 18,348 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.83 వద్ద ఉంది.
Also Read..