SEBI Chief: నిబంధనలకు విరుద్ధంగా ఆదాయం ఆర్జించిన సెబీ చీఫ్ మాధవి పురి బుచ్

ఇది నియంత్రణా అధికారుల నియమాలను ఉల్లంఘించడమేనని రాయిట్స్ తెలిపింది.

Update: 2024-08-16 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ తన పదవీకాలంలో ఓ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి ఆదాయాన్ని పొందారని, ఇది నియంత్రణా అధికారుల నియమాలను ఉల్లంఘించడమేనని రాయిట్స్ తెలిపింది. ఆమె 2017లో సెబీలో చేరారు. 2022, మార్చిలో ఉన్నత పదవిని చేపట్టారు. ఏడేళ్ల కాలంలో ఆమె, తన భర్త ఆధ్వర్యంలో సింగపూర్ కేంద్రంగా పనిచేసే అగోరా పార్ట్‌నర్స్, భారత్ కేంద్రంగా అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 99 శాతం వాటా ద్వారా రూ. 3.71 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారని, ఈ వివరాలు పబ్లిక్ డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా ఈ విషయం తెలిసినట్టు రాయిటర్స్ తెలిపింది. దీనివల్ల సెబీ-2008 సెబీ ఉద్యోగుల నియమావళిని ఉల్లంఘించడం కిందకు వస్తుందని రాయిటర్స్ అభిప్రాయపడింది. సెబీ ఉద్యోగులు ఇతర మార్గాల్లో జీతం లేదా మరే ఇతర ఆదాయాన్ని ఆర్జించకూడదనే నియమం ఉంది. అయితే, ఆ రెండు కన్సల్టెన్సీలు తన భర్త చూసుకుంటున్నారని, ఆయన 2019లో యూనిలీవర్ సంస్థ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత నుంచి తన కన్సల్టెన్సీ సేవల కోసం నిర్వహిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags:    

Similar News