SBI: కెనడాలోని బ్యాంక్ సేవలపై ఎస్‌బీఐ కీలక ప్రకటన
భారత్(India)-కెనడా(Canada) మధ్య గత కొంత కాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతింటున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: భారత్(India)-కెనడా(Canada) మధ్య గత కొంత కాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతింటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ దేశంలోని పలు ప్రాంతాల్లోని హిందూ దేవాలయాల(Hindu Temples)పై, హిందువులపై దాడులు జరగడంతో కొన్ని రోజుల నుంచి హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కెనడాలో తమ బ్యాంక్ సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, సంస్థ కార్యకలాపాలు ఎప్పటిలాగే నడుస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. రెగ్యులేటర్‌లు, కస్టమర్‌ల విధానంలో ఎలాంటి మార్పును చూడలేదని, సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ సెట్టీ(CS Shetty) వెల్లడించారు. 1982 నుండి కెనడాలో ఎస్‌బీఐ సర్వీసెస్ అందిస్తోందని, దీంతో అక్కడి ప్రజలు ఎస్‌బీఐని స్థానిక బ్యాంకుగా పరిగణిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే కోర్ ఆదాయాన్ని పెంచడానికి అన్ని మార్గాల్లో మా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కాగా కెనడాలో టొరంటో(Toronto), బ్రాంప్టన్(Brampton), వాంకోవర్(Vancouver)లతో పాటు మొత్తం ఎనిమిది శాఖల ద్వారా కస్టమర్లకు ఎస్‌బీఐ అక్కడ సేవలు అందిస్తోంది.