పెట్రో డాలర్‌కు సౌదీ గుడ్ బై.. అమెరికాకు దెబ్బ

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-06-13 17:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఉన్న 80 ఏళ్ల పెట్రోడాలర్ ఒప్పందానికి ముగింపు పలుకుతూ చేసిన సంచనల ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంసమైంది. మరోవైపు చమురు విక్రయాలకు సంబంధించి చైనాతో సౌదీ అరేబియా చర్చలు జరుపుతోంది. అమెరికాతో ఒప్పందాన్ని వదులుకోవడం ద్వారా సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్ డాలర్లకు బదులుగా చైనీస్ ఆర్ఎంబీ, యూరోలు, యెన్, యువాన్ వంటి ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగించి చమురు, ఇతర వస్తువులను విక్రయించవచ్చు. లావాదేవీల కోసం బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను అన్వేషించడం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ మార్పు ప్రపంచ చమురు మార్కెట్-అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించే ప్రపంచ ధోరణిని ఇది వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.

పెట్రోడాలర్ ఒప్పందం అంటే..

పెట్రోడాలర్ ఒప్పందం 1973 చమురు సంక్షోభం తర్వాత ఏర్పడింది. ఈ ఒప్పందం అనంతరం రెండు ఉమ్మడి కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. ఒకటి ఆర్థిక సహకారం, మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం చేశారు. దాంతో రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారానికి నాంది పలికింది.


Similar News