NESF-Slice: నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో స్టార్టప్ కంపెనీ స్లైస్ విలీనం.. ఇకనుంచి ఒకే బ్యాంకింగ్ సంస్థగా సేవలు..!
బెంగళూరు(Bangalore)కు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ 'స్లైస్(Slice)' తమ బిజినెస్(Business)ను నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్(NESF) బ్యాంకులో విలీనం చేసినట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bangalore)కు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ 'స్లైస్(Slice)' తమ బిజినెస్(Business)ను నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్(NESF) బ్యాంకులో విలీనం చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనానికి అవసరమైన షేర్ హోల్డర్(Shareholder), రెగ్యులేటరీ అనుమతులు(Regulatory Approvals) పొందినట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) పొందిన ఒక సంవత్సరం తర్వాత విలీన ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొంది. అక్టోబర్ 27, 2024 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోమవారం ఓ ప్రకటన లో తెలిపింది. దీంతో స్లైస్ కంపెనీకి చెందిన వ్యాపారలను ఇక నుంచి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చేపట్టనుంది.
ఈ విలీనం రెండు కంపెనీ ఆస్తులు(Assets),కార్యకలాపాలు(Operations), బ్రాండ్(Brand) గుర్తింపులను ఒకే బ్యాకింగ్ కంపెనీగా ఏకీకృతం చేస్తుందని స్లైస్ తెలిపింది. ఈ విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ ఈశాన్య ప్రాంతంలో(North East Region) బ్యాంక్ ఉనికిని మరింతగా పెంచుతుందని, భారతదేశం మొత్తం తమ బిజినెస్ ను విస్తరించేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే మరింత టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఈ విలీనం తర్వాత ఏర్పడిన సంస్థతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్లైస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాజన్ బజాజ్(Rajan Bajaj) అన్నారు.