కొత్త ఫ్లిప్, ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ దేశీయ ధరలు వెల్లడించిన శాంసంగ్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల తన కొత్త గెలాక్సీ జీఫోల్డ్ 5, గెలాక్సీ జీఫ్లిప్ 5 ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల తన కొత్త గెలాక్సీ జీఫోల్డ్ 5, గెలాక్సీ జీఫ్లిప్ 5 ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం భారత మార్కెట్ విక్రయాలు, ధరల వివరాలను కంపెనీ వెల్లడించింది. దేశీయ అవసరాల కోసం భారత్‌లోనే తయారీ ఉంటుందని శాంసంగ్ స్పష్టం చేసింది. గెలాక్సీ జీఫోల్డ్ 5, గెలాక్సీ జీఫ్లిప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఆగష్టు 18 నుంచి ఉంటాయని, గురువారం(జూలై 27) అర్ధరాత్రి నుంచే ప్రీ-బుకింగ్ మొదలవుతాయని కపెనీ ఆగ్నేయాసియా అధ్యక్షుడు జేబీ పార్క్ అన్నారు. గతంలో శాంసంగ్ ఫోల్డ్4, ఫ్లిప్ 4 స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లోనే తయారు చేసింది. 6 లక్షల కంటే ఎక్కువ ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్‌ల అమ్మకాలు నమోదవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ధరలకు సంబంధించి శాంసంగ్ జీఫ్లిప్5 ధరల శ్రేణి స్ట్రేజ్ ఎంపికను బట్టి రూ. 99,999 నుంచి రూ. 1,09,999 మధ్య ఉంటాయని, జీఫోల్డ్ 5 ధరలు రూ. 1.54 లక్షల నుంచి రూ. 1.85 లక్షల మధ్య, ట్యాబ్ ఎస్9 సిరీస్‌ల ధరలు రూ. 72,999 నుంచి రూ. 1,33,999 మధ్య ఉంటాయని వెల్లడించింది. ఇక, శాంసంగ్ వాచ్ 6 ధరలు రూ. 29,999 నుంచి ప్రారంభం కానున్నాయి.