ముకేష్ అంబానీ చేతుల్లోకి డిస్నీ+హాట్‌స్టార్.. అమెరికా కంపెనీతో భారీ డీల్
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను కొనుగోలు చేసేందుకు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ సంస్థ చర్చలు జరుపుతోంది. అమెరికాకు చెందిన డిస్నీ సంస్థ తమకు చెందిన ఇండియా విభాగాన్ని విక్రయించేందుకు గత కొంతకాలంగా ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం పెట్టుబడిదారుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ముఖేష్ అంబానీతో పాటు అదానీ గ్రూప్, సన్‌టీవీతో సంప్రదింపులు జరిపింది. చివరికి డిస్నీని కొనుగోలు చేసేందుకు ముకేష్ అంబానీ ముందుకొచ్చారు.
డిస్నీలోని మెజార్టీ వాటను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. 10 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డిస్నీ రెడీ అవ్వగా.. 7 లేదా 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఆసక్తి చూపుతోంది. త్వరలో డీల్‌పై అధికార ప్రకటన రానుండగా.. కొంత మొత్తంలో నగదు చెల్లించనుండగా.. మరికొంత షేర్ల రూపంలో బదిలీ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
రిలయన్స్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత.. డిస్నీ ఇండియాకు మైనారిటీ వాటా మాత్రమే ఉంటుంది. ఇండియాలో ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ ద్వారా డిస్నీ ఎక్కువమంది సబ్‌స్కైబర్లను పెంచుకుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో భారత్‌లో డిస్నీకి యూజర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో ఇండియా విభాగాన్ని విక్రయించేందుకు డిస్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది.