Tata Motors: అక్టోబర్ నెలలో స్వల్పంగా తగ్గిన టాటా మోటార్స్ అమ్మకాలు
టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) అక్టోబర్ నెలకు సంబంధించి వాహనాల అమ్మకాల సంఖ్యను ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) అక్టోబర్ నెలకు సంబంధించి వాహనాల అమ్మకాల సంఖ్యను ప్రకటించింది. గత నెలలో నేషనల్, ఇంటర్నేషనల్ కలిపి వెహికల్ అమ్మకాల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ లో మొత్తం 82,682 టాటా వాహనాలు అమ్ముడుపోగా అందులో ప్రయాణికుల వాహనాలు(Passenger Vehicles) 48,423 యూనిట్లు, వాణిజ్య వాహనాలు(Commercial Vehicles) 34,259 యూనిట్లు ఉన్నాయి. కాగా గతేడాది ఇదే అక్టోబర్ నెలలో 82,954 వెహికల్స్ అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. అలాగే ట్రక్కులు(Trucks), బస్సులు(Buses) కలిపి పోయిన నెలలో దాదాపు 31,848 యూనిట్లు సేల్ అయ్యాయని, అందులో దేశీయంగా 15,574 యూనిట్లు, అంతర్జాతీయంగా 16,274 యూనిట్ల విక్రయాలు జరిగాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా టాటా మోటార్స్ ఇటీవలే ఓ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ లాంచ్ చేసిన రెండు మోడల్స్ కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్(5-star Safety Ratings) సాధించాయి. ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన టాటా కర్వ్, కర్వ్ ఈవీ మోడల్స్ అడల్ట్ ప్రొటెక్షన్, చైల్డ్ సేఫ్టీ విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్స్‌ను పొందాయి. కాగా టాటా వాహనాలకు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సేఫ్టీ విషయంలో మంచి ఆదరణ ఉంది.