షాకింగ్ : త్వరలో 500 నోటు కూడా రద్ధు.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం?
రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2000 నోటును బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వార్త వైరల్ అవుతోంది. త్వరలో 500 నోట్లను కూడా రద్ధు చేసే దిశగా అడుగులు వేస్తోందంట. అయితే దీనికి కారణం లేకపోలేదు.
దిశ, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2000 నోటును బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వార్త వైరల్ అవుతోంది. త్వరలో 500 నోట్లను కూడా రద్ధు చేసే దిశగా అడుగులు వేస్తోందంట. అయితే దీనికి కారణం లేకపోలేదు.
నోట్ల కొరత, నకిలీ నోట్లు.. దీనివల్ల ఆర్బీఐ కు పెద్ద సమస్యగా మారింది. రెండు వేల నోట్లను మార్చుకొని అందరు ఈ నోట్లను తీసుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రోజూ వేల కోట్ల రూపాయల రూ.500 నోట్లు మాయమవుతున్నాయి. ఎప్పుడైతే రూ.2000 నోటును RBI ఉపసంహరించిందో. వెంటనే రూ.500 నోట్లకు డిమాండ్, 4 రెట్లు పెరిగింది. దాంతో,ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, నకిలీ నోట్ల మాయగాళ్లు రెడీ అయిపోయారు.
నకిలీ నోట్లను పాకిస్థాన్ లో ముద్రించి వాటిని నేపాల్, బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాకు తరలిస్తున్నారంట. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్ల కంటే 20 శాతం ఎక్కువ 500ల నోట్లు ఉన్నాయంట. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడకుండా ఉండేందుకు 500 నోట్లను కూడా రద్ధు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.
Also Read..