ఈ నెలాఖరు ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలతో నిర్వహించే అన్ని బ్యాంకులు ఆరోజున యథావిధిగా పనిచేయాలని ఆదేశించింది.

Update: 2024-03-21 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ఈ నెల 31తో ముగియనుంది. ఆరోజు ఆదివారం ఉండటంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. కానీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు ఆరోజున యథావిధిగా పనిచేయాలని ఆదేశించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులు సెలవుగా పరిగణిస్తాయి. కాబట్టి ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్న కారణంగా మార్చి 31న తెరిచే ఉంచాలని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు ఆరోజు బ్యాంకులు పనిచేయాలని ఆర్‌బీఐ తెలిపింది. కాబట్టి మార్చి 31న ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సాధారణ పనిదినాల మాదిరే కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ప్రజలు సైతం ఆరోజు సాధారణ రోజుల్లో మాదిరి బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ కూడా కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏజెన్సీ బ్యాంకుల పాత్ర..

ఆర్‌బీఐ ఎంపిక చేసిన ఏజెన్సీ బ్యాంకులు కీలకమైన ప్రభుత్వ సంబంధిత ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ నెట్‌వర్క్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఉంటాయి. ఈ సంస్థలు వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన చెల్లింపులు, రసీదులను నిర్వహిస్తాయి.

మార్చి 31న ముఖ్యమైన రోజు పనిచేయడానికి ఆర్‌బీఐ 33 ఏజెన్సీ బ్యాంకులను నియమించింది. ఈ జాబితాలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. అదనంగా, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ జాబితాలో ఏకైక విదేశీ బ్యాంకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

4. కెనరా బ్యాంక్

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. ఇండియన్ బ్యాంక్

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

9. పంజాబ్ నేషనల్ బ్యాంక్

10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11. యూకో బ్యాంక్

12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రైవేట్ రంగ బ్యాంకులు

13. యాక్సిస్ బ్యాంక్

14. సిటీ యూనియన్ బ్యాంక్

15. డీసీబీ బ్యాంక్

16. ఫెడరల్ బ్యాంక్

17. హెచ్&డీఎఫ్‌సీ బ్యాంక్

18. ఐసీఐసీఐ బ్యాంక్

19. ఐడీబీఐ బ్యాంక్

20. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

21. ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్

22. జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్

23. కర్ణాటక బ్యాంక్  

Tags:    

Similar News