RBI: ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ రాజేశ్వర్‌ రావు పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) డిప్యూటీ గవర్నర్‌(Dy.Governor) ఎం.రాజేశ్వర్‌ రావు(M.Rajeshwar Rao) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరో ఏడాది పొడిగించింది .

Update: 2024-10-06 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) డిప్యూటీ గవర్నర్‌(Dy.Governor) ఎం.రాజేశ్వర్‌ రావు(M.Rajeshwar Rao) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరో ఏడాది పొడిగించింది .ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాజేశ్వర్‌ రావు పదవీకాలాన్ని అక్టోబర్‌ 9,2024 నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.కాగా ఆయన పదవీకాలాన్ని ఇప్పటికే కేంద్రం రెండు సార్లు పొడిగించింది.ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రాజేశ్వర్‌ రావు అక్టోబర్‌ 2020లో మూడేళ్ల కాలపరిమితితో నియమితులయ్యారు.1984లో రిజర్వ్ బ్యాంక్‌లో చేరారు. రాజేశ్వర్‌ రావు డిప్యూటీ గవర్నర్‌గా నియామకం కాకముందు ఆర్‌బిఐ(RBI)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ విభాగంలో పని చేశారు.


Similar News

టమాటా @ 100