ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం: నిపుణులు

దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ వారంలో జరిగే ఎంపీసీ సమావేశంలో కీలక రేట్ల పెంపును తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Update: 2022-12-04 17:00 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ వారంలో జరిగే ఎంపీసీ సమావేశంలో కీలక రేట్ల పెంపును తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుస మూడు సమావేశాల్లో ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. ఈసారి 25-35 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చని నిపుణులు పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు వడ్డీ రేట్లు పెంపును తగ్గించాలని పరిశ్రమల సంఘం అసోచామ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెపో రేటు 6.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈసారి 25-35 బేసిస్ పాయింట్లు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి రెపో రేటు పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ షబ్నవీస్ అన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది మే నెల నుంచి కీలక రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News