RBI: సౌత్ ఇండియన్ బ్యాంకుపై జరిమానా విధించిన ఆర్‌బీఐ
దీనికి సంబంధించి ఆదేశాలు, నిబంధనలను పాటించకపోవడంపై సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్‌కి నోటీసు జారీ చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: 'డిపాజిట్‌లపై వడ్డీ రేటూ, 'బ్యాంకుల్లో కస్టమర్ సేవ'పై నిర్దిష్ట ఆదేశాలను పాటించని కారణంగా సౌత్ ఇండియన్ బ్యాంక్‌పై రూ.59.20 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. ఆర్థిక స్థితికి సంబంధించి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ అనంతరం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆదేశాలు, నిబంధనలను పాటించకపోవడంపై సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్‌కి నోటీసు జారీ చేసింది. కొంతమంది ఖాతాదారులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లేదా లేఖ ద్వారా సమాచారం ఇవ్వకుండా కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదంటూ బ్యాంకు జరిమానా ఛార్జీలను వసూలు చేసింది. అలాగే, నిర్దిష్ట ఎన్ఆర్ఈ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాల విషయంలో నిబంధనలు పాటించలేదని ఆర్‌బీఐ తన నోటీసులో పేర్కొంది. పెనాల్టీ చట్టబద్ధమైన, నియంత్రణ అనుమతుల లోపాలపై ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.