ఆర్‌బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మునీష్ కపూర్ నియామకం!

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మునీష్ కపూర్‌ను నియమిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.

Update: 2023-10-04 16:26 GMT

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మునీష్ కపూర్‌ను నియమిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అక్టోబ‌ర్ 3 నుంచే ఆయన నియామ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప‌దోన్నతికి ముందు క‌పూర్ ఆర్‌బీఐ మానిట‌రీ పాల‌సీ విభాగం అడ్వైజ‌ర్ ఇన్‌చార్జిగా వ్యవ‌హ‌రించారు. ప్రస్తుతం ఆర్ధిక‌, విధాన ప‌రిశోధ‌న విభాగాన్ని ప‌ర్యవేక్షిస్తారు. ఆర్‌బీఐలో మూడు ద‌శాబ్ధాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మునీష్ క‌పూర్ స్థూల ఆర్థిక విధానం, రీసెర్చ్, ద్రవ్య విధానం వంటి వివిధ విభాగాల్లో ప‌నిచేశారు. 2012-15 మధ్యకాలంలో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు మునీష్ క‌పూర్ అడ్వైజ‌ర్‌గా వ్యవ‌హ‌రించారు. ఎక‌న‌మిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని క‌లిగి ఉండ‌టంతో పాటు ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక‌ర్స్ స‌ర్టిఫైడ్ అసోసియేట్‌(సీఏఐఐబీ) కలిగి ఉన్నారు.


Similar News