Hero Motors: ఐపీఓ ప్రతిపాదనను విరమించుకున్న హీరో మోటార్స్..!

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీ హీరో మోటార్స్(Hero Motors) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు అనుమతించాలని కోరుతూ ఆగస్ట్ నెలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ముందు ప్రతిపాదన పెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-10-07 17:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీ హీరో మోటార్స్(Hero Motors) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు అనుమతించాలని కోరుతూ ఆగస్ట్ నెలలో సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ముందు ప్రతిపాదన పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.హీరో మోటార్స్ ఐపీఓ ద్వారా రూ. 900 కోట్ల విలువైన షేర్లను సమీకరించాలని సెబీ ముందు ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది.అయితే ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఈ నెల ఐదో తేదీన సెబీకి వెల్లడించింది.దీనికి గల కారణాలను మాత్రం ఆ సంస్థ బయటకి వెల్లడించలేదు. కాగా ఆగస్ట్ నెలలో సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. ఆ సంస్థ రూ. 500 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వెళ్లాలని తొలుత నిర్ణయించుకుంది. మరో రూ. 400 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని యోచించారు. హీరో మోటార్స్ లో పంకజ్ ముంజాల్ కు 71.75 శాతం, భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 6.28 శాతం, హీరో సైకిల్స్ లిమిటెడ్‌కు 2.03 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.


Similar News