Prime Video: యాపిల్ టీవీ ప్లస్ యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభించిన ప్రైమ్ వీడియో

యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో ప్రైమ్ వీడియోలతో పాటు ఈ యాపిల్ టీవీ ప్లస్ సేవలను పొందవచ్చు.

Update: 2025-04-02 16:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తన యూజర్ల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా కస్టంబర్ బేస్‌ను పెంచుకునే లక్ష్యం, ఓటీటీ విభాగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ యాపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ సేవలను తీసుకొచ్చింది. దీంతో ప్రైమ్ వీడియో కస్టమర్లు ఇకపై యాపిల్ టీవీ ప్లస్ వీడియోలను కూడా చూడవచ్చు. యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో ప్రైమ్ వీడియోలతో పాటు ఈ యాపిల్ టీవీ ప్లస్ సేవలను పొందవచ్చు. దీనికోసం కస్టమర్లు నెలకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రైమ్ వీడియో ఇప్పటికే యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ కింద లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, బీబీసీ ప్లేయర్, ఎంజీఎం ప్లస్, సోనీ పిక్చర్స్ సహా పలు వీడియో కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఈ తరహా సేవలను అందిస్తున్న ప్రైమ్ వీడియో, ఇతర దేశాలకూ విస్తరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీన తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ విభాగంలో పోటీ పెరిగింది. 

Tags:    

Similar News