ప్రెగ్నెంట్ మహిళలకు రూ. 5 వేలు.. అదిరిపోయే ప్రభుత్వ స్కీమ్

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల కోసం చాలా రకాల పథకాలను తెస్తుంది.

Update: 2023-05-04 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల కోసం చాలా రకాల పథకాలను తెస్తుంది. ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేకంగా కొన్నింటిని తెచ్చింది. అయితే ప్రెగ్నెంట్ మహిళల కోసం మరోక స్కీమ్‌ను తెచ్చింది. దాని పేరు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY). ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రెగ్నెంట్ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రోజువారీ కూలీలు లేదా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న మహిళలు గర్భధారణ, ప్రసవం తర్వాత వైద్య చికిత్స, ఔషధ ఖర్చుల కోసం ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి అర్హత కలిగిన వారికి రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ అమౌంట్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయి.


రూ. 5 వేలు ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తారు. తొలి విడత కింద రూ.1000 ఇస్తారు. గర్భం దాల్చిన ఆరవ నెలలో రూ. 2,000 అందిస్తారు. బిడ్డ పుట్టినప్పుడు తర్వాత మూడో విడత రూ. 2,000 ఇస్తారు. మాతృ వందన యోజన పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుంది, రెండో కాన్పు కి వర్తించదు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ స్కీమ్ వర్తించదు. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం దగ్గరలోని ఆశా వర్కర్లును సంప్రదించవచ్చు.

Read more:

Aadhaar card :ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన కేంద్రం

Tags:    

Similar News