సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూలంగా భారతదేశ ఎగుమతులు: పీయూష్ గోయల్

ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు సానుకూలంగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Update: 2024-07-14 10:32 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు సానుకూలంగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముఖ్యంగా మే నెలలో ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు అయిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఎగుమతుల పరంగా సేఫ్ జోన్‌లో కొనసాగిందని గోయల్ అన్నారు. ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా మిషన్‌తో సేవల రంగానికి ఊతం లభించింది, దీంతో ఈ రంగంలో వృద్ధి ఎక్కువగా ఉండటం వలన ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధి రేటును నమోదు చేయడానికి అవకాశం లభించింది. మే నెలతో పాటు, జూన్‌లో కూడా గణాంకాలు సానుకూలంగా ఉన్నాయని గోయల్ చెప్పారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ మాంద్యం పరిస్థితులు మెరుగుపడటం మొదలైన తరువాత అమెరికా, ఐరోపా వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో దేశంలోకి పెట్టుబడులు భారీగా వస్తాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్యకాలంలో, ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఒక్క మే నెలలో భారతదేశ సరుకుల ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.

Tags:    

Similar News