Pixel phones Ban: ఇండోనేషియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. గూగుల్ పిక్సెల్ ఫోన్లపై నిషేధం..!

ఇండోనేషియా ప్రభుత్వం(Indonesian Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-02 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియా ప్రభుత్వం(Indonesia Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్(Google) కంపెనీకి చెందిన పిక్సెల్ ఫోన్ల(Pixel phones) అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా దేశంలో 95 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని వాగ్దానం చేసి అమ్మకాలను తగ్గించిన యాపిల్(Apple)కు చెందిన ఐఫోన్16(iPhone 16) ఫోన్లపై ఇండోనేషియా ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ఆ దేశ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలో విక్రయించే ఫోన్లలో కనీసం 40 శాతం లోకల్(Local)గా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలి. కానీ గూగుల్ ఆ నిబంధనను పాటించకపోవడం వల్ల ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయంపై ఇండోనేషియా పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రతినిధి(Spokesperson of the Ministry of Industry) ఫెబ్రి హెండ్రీ ఆంటోని అరీఫ్(Febri Hendry Antoni Arif) స్పందించారు. ఇండోనేషియాలోని పెట్టుబడిదారులందరికీ అవకాశం కలిపించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్స్ ను తీసుకొచ్చామని, కానీ కొన్ని కంపేనీలు ఈ నిబంధనలను పాటించడం లేదని, రూల్స్ ని ఎవరు అతిక్రమించిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గూగుల్ పిక్సెల్ ఫోన్లు కావాలనుకున్న వారు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవచ్చని, అయితే అందుకుగాను వారు గవర్నమెంట్(GOVT)కు ట్యాక్స్(Tax) చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. 

Tags:    

Similar News